రజనీ మ్యాజిక్ .. మాస్ ఆడియన్స్ ను ఊపేస్తోన్న 'కాలా'

  • యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా 'కాలా'
  • రజనీ డైలాగ్స్ కి పడుతోన్న విజిల్స్
  • వన్ మేన్ షో అంటోన్న ఫ్యాన్స్
మాఫియా నేపథ్యంలో రజనీకాంత్ చేసిన సినిమాలు ఘన విజయాలను అందుకున్నాయి. ఈ తరహా సినిమాల్లో ఆయన తన స్టైల్ తో ఆడియన్స్ ను కట్టిపడేశారు. అందువల్లనే ఆయన నుంచి మాఫియా నేపథ్యంలో సినిమా వస్తుందంటే అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు. అలాంటి అభిమానుల ముందుకు ఈ రోజు 'కాలా' వచ్చేసింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు రజనీకాంత్ ఎప్పటిలానే తన స్టైల్ తో అదరగొట్టేశాడని చెబుతున్నారు. ముంబై మురికివాడ 'ధారవి' ప్రాంత ప్రజలకు అండగా నిలిచే కరికాలుడు అలియాస్ 'కాలా' పాత్రలో రజనీ జీవించాడని అంటున్నారు. యాక్షన్ .. ఎమోషన్ కి తన స్టైల్ ను జోడించి రజనీ మ్యాజిక్ చేశాడని చెబుతున్నారు. ద్వితీయార్థంలో నానాపటేకర్ ఇంటికి వెళ్లి హెచ్చరించే సీన్ .. ఆ సమయంలో 'భగవంతుడు ఆదేశిస్తున్నాడు .. కాలా పాటిస్తున్నాడు' అంటూ ఆయన డైలాగ్ చెప్పే తీరును చూసి తీరాల్సిందేనని అంటున్నారు. రజనీ అభిమానులు ఆశించినట్టుగా ఇది ఆయన వన్ మ్యాన్ షో అని చెబుతున్నారు.
Go Back to Shorts
rajani
huma

More Telugu News